HIV వైద్య సేవలపై అధికారుల సమీక్ష
NEWS Nov 15,2026 12:14 pm
జగిత్యాల: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌ఐవి వైద్య సేవలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఏఆర్టీ, ఐసీటీసీ కేంద్రాల రికార్డులను పరిశీలించి, చికిత్స మధ్యలో ఆపేసిన వారిని తిరిగి వైద్య సేవల్లోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా సురక్షిత్ ప్లస్ హోదా సాధించేలా సేవలను మెరుగుపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి, కౌన్సిలర్ రజని, డీఈఓ అనిల్, వైద్యాధికారులు పాల్గొన్నారు.