ఇండోర్: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2026–27 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో బిహార్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పటికి అతడి వయసు 15 ఏళ్ల 232 రోజులు మాత్రమే. ఇప్పటివరకు ఈ రికార్డు క్రొయేషియా ఆటగాడు జాక్ వుకుసిచ్ పేరిట ఉండేది. అతడు 17 ఏళ్ల 311 రోజుల వయసులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తాజా ఘనతతో వైభవ్ ఆ రికార్డును అధిగమించాడు. త్వరలో దోహాలో జరిగే టోర్నీలో భారత్–ఏ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించనున్నాడు.