విద్యార్థినులే ఉపాధ్యాయులుగా మారారు
NEWS Nov 13,2026 08:12 pm
రాయికల్: మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టి తమలోని నాయకత్వ లక్షణాలు, ప్రతిభను చాటుకున్నారు. ఎంఈఓ ఎస్. రాఘవులు, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు పొన్నం రమేష్ పాల్గొన్నారు.