21 మంది ఐపీఎస్‌ల బదిలీలు
హైదరాబాద్ పీసీ మహేశ్ భగవత్
NEWS Nov 12,2026 08:11 pm
తెలంగాణ వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. సీపీగా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా బదిలీ చేశారు. అదనంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ బాధ్యతలు అప్పగించారు. లా & ఆర్డర్, ఏసీబీ, సీఐడీ, మహిళా భద్రత, ట్రాఫిక్ విభాగాల్లోనూ మార్పులు చేపట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.