తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు
NEWS Nov 12,2026 08:14 pm
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలకు అలిపిరి నుండి కాలినడకన వచ్చే మార్గంలోని మాధవ నిలయం(పిఏసి-2) నుంచి జిఎన్సీ టోల్ గేట్ వరకు ఉన్న నడక మార్గాన్ని పరిశీలించారు. ఈ మార్గంలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా దర్శనం, ఉచిత వసతుల సమాచారాన్ని పొందుపరచాలని అధికారులకు సూచించారు. ఈ మార్గంలో చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఇక్కడి దుకాణాలను తనిఖీ చేసి తాగునీరు, తినుబండారాలను నిర్దేశిత ధరలకు విక్రయించాలని, అక్రమాలు ఉండకూడదని స్పష్టం చేశారు.