శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు
NEWS Nov 12,2026 08:15 pm
శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రసాదం కోసం కాగుతున్న నెయ్యి ఒలికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటల ధాటికి కేంద్రంలోని విద్యుత్ తీగలు కాలిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన పోటు సిబ్బంది వెంటనే బయటకు వచ్చేశారు. ఆలయ సిబ్బంది భక్తులను దూరంగా పంపించడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.