రేషన్ బియ్యం కోసం ఎదురుచూపులు
NEWS Nov 12,2026 08:12 pm
మామడ (మం) తాండ్ర గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ ఆలస్యంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ డీలర్ అందుబాటులో లేకపోవడంతో బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులు ఉ. 8 గంటల నుంచి మ. 12 గంటల వరకు అక్కడే వేచి చూస్తున్నారు. పొలం పనులు ముగించుకుని వచ్చిన రైతులు గంటల తరబడి ఎదురుచూస్తున్నా డీలర్ నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.