కేసీఆర్ అప్పులకు లక్షల కోట్ల వడ్డీ
NEWS Nov 09,2026 10:02 pm
గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పదో తేదీలోపు సంక్షేమ పథకాల నిధులు, 20లోపు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఏటా రూ.80 వేల కోట్ల వడ్డీ కడుతున్నామని, ఇప్పటికే రూ.2 లక్షల కోట్లకు పైగా చెల్లించామన్నారు. వికారాబాద్ జిల్లా హకీంపేట్‌లో నిర్వహించిన ‘రైతన్నతో ఆత్మీయ సభ’లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రూ.9,050 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.