కొత్తగా 4.5 లక్షల మందికి పింఛన్లు
NEWS Nov 07,2026 11:48 pm
TG: దీపావళి పండుగ వేళ తెలంగాణలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. కొత్తగా 4.5 లక్షల మందికి పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల నుంచే కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు మొదలవుతాయన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా లభించనుంది.