తూ.గో. జిల్లా దేవరపల్లి (M) ధుమంతునిగూడెంలో జనసేన తరఫున MPTC అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య (28) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆమె సమీప ప్రత్యర్థిపై 350 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గురువారం ఓటు వేసిన కొన్ని గంటలకే అనారోగ్యానికి గురైన దివ్యను ఆసుపత్రులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. విజయం సాధించిన ఆనందాన్ని ఆమె కుటుంబంతో పంచుకోకుండానే కన్నుమూయడంతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.