జగన్ కంచుకోటలో టీడీపీ విజయం!
NEWS Nov 07,2026 12:54 pm
ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠభరితంగా సాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్లో అధికార కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. YCP కంచుకోటలో పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని TDP అభ్యర్థి భారతి కైవసం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యత వైపు దూసుకుపోతుండగా, పులివెందుల ఫలితం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.