దీపావళి ఆఫర్లతో సైబర్ వల
NEWS Nov 07,2026 06:22 am
దీపావళి పండుగ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. Airtel పేరుతో ప్రతి ఒక్కరికీ ₹2 వేలు ఫ్రీగా ఇస్తున్నట్లు నకిలీ మెసెజ్లు పంపుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా ద్వారా ప్రచారమవుతున్న లింకులను ఓపెన్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేస్తే ఖాతాల్లోని నగదు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి లింకులను క్లిక్ చేయవద్దని, నకిలీ మెసె జ్లను ఫార్వర్డ్ చేయకూడదని, మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.