ప్రపంచ వేదికకు హైదరాబాద్ సిద్ధం!
NEWS Nov 06,2026 06:04 pm
అంతర్జాతీయ స్థాయి సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈనెల 12, 13, 14 తేదీల్లో హైటెక్స్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. దాదాపు 450 మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ఎంపీ శశి థరూర్ తదితరులు పాల్గొననున్నారు. 3 రోజుల పాటు జరిగే సదస్సులో అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక పురోగతి, ప్రపంచ భాగస్వామ్యాల బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి.