టికెట్ లేకుండా 1100 మంది ప్రయాణం
NEWS Nov 06,2026 04:57 pm
దీపావళి, ఛత్ పండుగల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక టికెట్ తనిఖీలు చేపట్టింది. నవంబర్ 5న సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లలో నిర్వహించిన తనిఖీల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 11,150 మందిపై కేసులు నమోదు చేసి ₹1.18 కోట్ల జరిమానా వసూలు చేసింది. ఇందులో సికింద్రాబాద్ డివిజన్ అత్యధికంగా ₹1.02 కోట్ల ఆదాయం సాధించింది. ఈ తనిఖీల్లో 117 మంది మహిళా సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సిబ్బందిని అభినందిస్తూ, ప్రయాణికులు తప్పనిసరిగా సరైన టికెట్లతోనే ప్రయాణించాలని సూచించారు.