ఓటరు నమోదుకు యర్కల దరఖాస్తు
NEWS Nov 06,2026 10:18 am
కట్టంగూర్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న యర్కల శ్రీనివాస్ గౌడ్, కట్టంగూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం దరఖాస్తు సమర్పించారు. నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు యర్కల. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.