భారీ నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
NEWS Nov 04,2026 01:47 pm
హైదరాబాద్: నగర శివార్లలో నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి, రూ.6.78 కోట్ల విలువైన రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్ వీడియోల ద్వారా నకిలీ నోట్ల తయారీ నేర్చుకున్న నిందితులు, దోపిడీలకు కూడా పాల్పడుతున్నట్లు గుర్తించారు. నవంబర్ 1న రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో కారును తనిఖీ చేసి నిందితులను పట్టుకున్నారు. విచారణలో కుంట్లూర్లోని అద్దె ఇంట్లో నకిలీ నోట్ల తయారీ కేంద్రాన్ని గుర్తించి, ప్రింటర్లు, ల్యాప్టాప్లు, కటింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.