సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్
NEWS Nov 04,2026 01:44 pm
ఏపీలో వరుసగా అర్నబ్, మురసు తుపాన్లు రావడంతో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లిందని చంద్రబాబు వివరించారు. రోడ్లు, విద్యుత్తు సరఫరా సహా వివిధ రంగాలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానిని కోరారు. తుపాను సహాయక చర్యల్లో రాష్ట్రప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని అభిప్రాయపడ్డారు.