జగిత్యాల వైద్యారోగ్య శాఖకు ప్రశంసల పురస్కారం
NEWS Nov 04,2026 06:37 am
జగిత్యాల: ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య సేవలు, వివిధ వ్యాధుల నియంత్రణలో చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా జగిత్యాల జిల్లా వైద్యారోగ్య శాఖకు ప్రశంసల పురస్కారం లభించింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ జి. సుజాత, టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్. శ్రీనివాస్ పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యారోగ్య శాఖ కృషిని గుర్తించి ఈ అవార్డు అందజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ ఐఏఎస్, వైద్యారోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.