గృహిణుల శ్రమకు ప్రతిరోజూ గుర్తింపు ఇవ్వాలి: వేల్పుల శిరీష
NEWS Nov 03,2026 09:51 pm
నవంబర్ 3 జాతీయ గృహిణుల దినోత్సవం సందర్భంగా టీచర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త వేల్పుల శిరీష ప్రత్యేక సందేశం ఇచ్చారు. కుటుంబ నిర్వహణ, పిల్లల పెంపకం, వృద్ధుల సంరక్షణలో గృహిణుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇంటి పనుల్లో కుటుంబ సభ్యులందరూ భాగస్వాములు కావాలని, గృహిణుల శ్రమను గుర్తించి వారి ఆరోగ్యం, అభిరుచులు, ఆశయాలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. గృహిణులను ఒక్కరోజే కాకుండా ప్రతిరోజూ గౌరవించాలని పిలుపునిచ్చారు.