జగిత్యాల ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై కమిషనర్ సమీక్ష
NEWS Nov 03,2026 09:50 pm
జగిత్యాల జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం రాత్రి కమిషనర్ శ్రీ ముష్రాఫ్ అలీ ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత జిల్లా ఆస్పత్రిలో జరుగుతున్న ప్రసవాలు, జిల్లాలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, వాటి పురోగతి వివరాలను కమిషనర్‌కు వివరించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎన్. శ్రీనివాస్, డాక్టర్ జైపాల్ రెడ్డి, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ నరేంద్ర, మురళీధర్, నాగరాజ్‌తో పాటు ఆరోగ్యశాఖ సూపర్వైజర్లు పాల్గొన్నారు.