పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తూ అందరికీ అందుబాటులో బియ్యం ధరలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ధరలను నిర్ణయించింది. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులు నిర్మల్ జిల్లాలోని వ్యాపారులకు సూచనలు చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు బియ్యం అమ్ముతున్నట్లు, ఎలాంటి బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా ప్రజలకు అందుబాటులో బియ్యం అందిస్తామని నిర్మల్ పట్టణ వ్యాపారులు తెలుపుతున్నారు.