చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
NEWS Nov 02,2026 04:04 pm
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యాటనలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆ లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించానంటూ ట్వీట్ చేశారు.