అరటి తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారి
NEWS Nov 02,2026 03:43 pm
కంభం మండలంలో అరటి తోటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి పి. జెనమ్మ పరిశీలించారు. తుఫాను ‘మురసు’ నేపథ్యంలో ఈదురుగాలులు, భారీ వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్, టిష్యూ కల్చర్ సాగు, బంచ్ కవర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, రాయలసీమ రైజింగ్ పథకాల వివరాలను రైతులకు తెలియజేశారు.