జోగినిని హత్య చేసి బంగారం, వెండి చోరీ
NEWS Nov 02,2026 11:28 am
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జోగిని రాళ్లబండ సుధాకర్ (50) హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. అస్సాంకు చెందిన పవన్, హర్ష అనే ఇద్దరు శిష్యులు దోపిడీ కోసం సుధాకర్‌ను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కాళ్లు, చేతులు కట్టేసి, పెప్పర్ స్ప్రే చల్లి, గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఇంట్లోని 130 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, రూ.10 లక్షల నగదుతో పరారయ్యారు. దోచుకున్న సొత్తు విలువ రూ.3 కోట్లుగా అంచనా. సుధాకర్ కారులో పారిపోతున్న నిందితులను జీపీఎస్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌ను సైతం నిందితులు తీసుకెళ్లినట్లు గుర్తించారు.