దుబాయ్‌లో బంగారంపై నడవొచ్చు!
NEWS Nov 01,2026 11:03 pm
పర్యాటకులను ఆకర్షించేందుకు దుబాయ్ మరో వినూత్న ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. డీరా ప్రాంతంలోని గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో 24 క్యారెట్ల బంగారంతో ప్రత్యేక నడక మార్గాన్ని (గోల్డ్ వాక్‌వే) నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2026 చివరి నాటికి దీన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే తొలి, అత్యంత పొడవైన గోల్డ్ వాక్‌వేగా తీర్చిదిద్దాలని భావిస్తోంది.