గిద్దలూరు పీఠం వైఎస్సార్‌సీపీదే
NEWS Nov 01,2026 10:58 pm
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి భూమా బాలు నరసింహారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా గిద్దలూరు మున్సిపల్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.