అమెరికా ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ
NEWS Nov 01,2026 10:58 pm
తెలంగాణ మూలాలున్న సరిత కొమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమెకు మద్దతు ప్రకటించారు. హార్వర్డ్‌లో విద్యాభ్యాసం చేసిన సరిత గతంలో ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లో జన్మించిన ఆమె తల్లి హైదరాబాద్‌లో పెరగగా, తండ్రిది కరీంనగర్ జిల్లా చేగొన్న గ్రామం. కుటుంబ మూలాలను పిల్లలకు పరిచయం చేసేందుకు స్వగ్రామానికి వెళ్తుంటామని తెలిపారు. న్యూయార్క్‌లో అటార్నీ జనరల్ పదవికి పోటీ చేస్తున్న తొలి దక్షిణాసియా సంతతి అభ్యర్థిని తానేనని వెల్లడించారు. ప్రజల భద్రతకు జాతి, మతం, రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు.