హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన
NEWS Nov 01,2026 02:09 pm
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నిజాం కాలేజీ నుంచి మొజాంజాహీ మార్కెట్ వరకు నిర్వహించే మహా పాదయాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, సా. 4 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. 5:05 గంటలకు మొజాంజాహీ మార్కెట్ చేరుకుని సభలో ప్రసంగిస్తారు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.