భారీగా పడిపోయిన బంగారం ధరలు
NEWS Nov 01,2026 11:27 am
బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,880 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,27,300 వద్ద ట్రేడవుతోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా ఇవే ధరలు స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ. 1,39,030, 22 క్యారెట్ల రేటు రూ. 1,27,450 గా నమోదు అయ్యాయి. 1 కిలో వెండి ధర రూ. 2,00,000.