‘ఇరుముడి’ మేకర్స్‌కు నోటీసులు
NEWS Nov 01,2026 05:52 am
రవితేజ మూవీ ‘ఇరుముడి’ సినిమా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌కు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. చిత్రంలో బాలనటి బేబీ నక్షత్ర విషయంలో బాలకార్మిక చట్ట నిబంధనలు పాటించలేదంటూ వచ్చిన ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. జైలోక్సత్తా సోషల్ జస్టిస్ ఫోరం అధ్యక్షుడు చొల్లేటి మహేశ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. బాలనటికి సంబంధించిన జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి, తల్లిదండ్రుల సమ్మతి, పారితోషికంలో 20% ఫిక్స్డ్ డిపాజిట్, షూటింగ్ వేళలు, విద్యకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలపై వివరణ కోరారు. నవంబర్ 4న కార్మిక సంక్షేమ భవన్లో ఆధారాలతో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.