రిటైర్మెంట్ రోజే అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి
NEWS Oct 31,2026 05:27 pm
ఉద్యోగులు పదవీ విరమణ పొందిన రోజే వారికి రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు అందించాలని టీజీయూఎస్ జిల్లా అధ్యక్షుడు నునావత్ రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఇటిక్యాల పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన కాసరపు నాగలక్ష్మికి నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సదాశివ్, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.