టీటీడీకి రూ.20 లక్షలు విరాళం!
NEWS Oct 31,2026 11:00 pm
టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు హైదరాబాద్కు చెందిన దాతలు రూ.20 లక్షల విరాళం అందించారు. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన ధర్మ తేజ అనే భక్తుడు టీటీడీ బర్డ్ ట్రస్టుకు మరో రూ.10 లక్షలు అందించారు. దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుకు విరాళాల డీడీలను అందజేశారు.