కోరుట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్
NEWS Oct 31,2026 10:10 pm
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతారాణిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో సూపరింటెండెంట్ ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. అంతేకాకుండా, ఆసుపత్రి సిబ్బందికి ఒకేసారి సెలవులు మంజూరు చేసినట్లు పరిశీలనలో వెల్లడైంది. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యతను విస్మరించడం పరిపాలనా నిర్లక్ష్యంగా, పర్యవేక్షణ లోపంగా పరిగణిస్తూ కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు.