టీటీడీ రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ
NEWS Oct 31,2026 10:59 pm
తిరుమలలోని టీటీడీ రవాణా విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల డిపోలోని సుమారు 161 వాహనాలను వివిధ రకాల పుష్పాలు, తోరణాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి నమూనా విగ్రహానికి పూజలు చేసిన అనంతరం భక్తులకు, సిబ్బందికి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జనరల్ మేనేజర్ పి. రాము, డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసన్న, పలువురు విభాగాధిపతులు, తిరుపతి–తిరుమల డిపో ఇన్‌ఛార్జీలు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.