మాదకద్రవ్యాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు
NEWS Oct 31,2026 10:58 pm
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా,అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీస్ కమిషనర్ శ్వేత ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు నగరంలోని ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు సమాజ భద్రతకు తీవ్ర ముప్పు అని పేర్కొన్నారు. డ్రగ్ సరఫరా,విక్రాయలు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.