ఒకే వేదికపై చిరు, పవన్, చరణ్
NEWS Oct 30,2026 07:13 pm
చిరంజీవి హోస్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ షోలో బ్రహ్మానందం, సునీల్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు పాల్గొంటున్నట్లు సమాచారం. చిరంజీవి, పవన్, రామ్ చరణ్ ముగ్గురూ ఒకే వేదికపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి వ్యక్తిగత జ్ఞాపకాలు, సినీ అనుభవాలు ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో పంచుకోనున్నట్లు సమాచారం. నవంబర్ మూడో వారం నుంచి షో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం.