పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
NEWS Oct 30,2026 07:16 pm
శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమం నిర్వహించారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థులకు రూ.4వేల నుండి రూ.5వేల వరకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 మంది విద్యార్థులకు ఈ సహాయం అందించగా, అందులో మల్యాల మండలంలో 15 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్బీహెచ్ రమేష్, ఆర్టీఎల్ రాము, జగిత్యాల బీఎం చిరంజీవి, సీఎం కుమార్ తదితరులు పాల్గొని విద్యార్థులకు చెక్కులను అందజేశారు.