బెంగళూరులో పీఎంశ్రీ హెచ్‌ఎంల పర్యటన
NEWS Oct 30,2026 07:17 pm
పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నాయకత్వ, పరిపాలనా సామర్థ్యాల పెంపు కోసం నిర్వహిస్తున్న ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది ప్రధానోపాధ్యాయులు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)ను సందర్శించారు. ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆధునిక విద్యా విధానాలు, నూతన ఆవిష్కరణలు, పాఠశాలల సమర్థవంతమైన నిర్వహణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై అవగాహన పొందారు. ఈ పర్యటన అనుభవాలు పాఠశాలల అభివృద్ధికి ఉపయోగపడతాయని తెలిపారు.