పోలీస్ సిబ్బంది నిబద్ధతతో పని చేయాలి
NEWS Oct 30,2026 07:14 pm
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా సెంట్రల్ జోన్ డిసిపి కవిత సందర్శించారు.స్టేషన్ కు చేరుకున్న డీసీపీకి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్ లోని పలు విభాగాలను డిసిపి క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ కు సంబంధించిన రికార్డులను అలాగే సిబ్బంది పనితీరును ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.నేరాల నియంత్రణలో టెక్, సైబర్ క్రైమ్ విభాగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.