మల్యాల రామాలయ శిలలకు ఆళ్లగడ్డలో పూజలు
NEWS Oct 30,2026 07:16 pm
మల్యాల మండల కేంద్రంలోని ధర్మగిరిలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి సంబంధించిన శిలలకు ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆలయ కమిటీ సభ్యులు శిలా పూజ నిర్వహించారు. గ్రానైట్ శిలలకు వేద పండితుడి మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా పూజలు చేశారు. శిలలను పసుపు, కుంకుమలతో అలంకరించి, కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు. త్వరలోనే శిలలను మల్యాలకు తరలించి ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.