లింగోజిపల్లిలో మిరప సాగుపై అవగాహన
NEWS Oct 29,2026 10:58 pm
కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మిరప సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యానశాఖ అధికారి ఎన్. శ్రీకాంత్, ఉద్యాన శాస్త్రవేత్త ఆర్.వి.ఎస్. రెడ్డి ఆధునిక సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, సమగ్ర పోషక యాజమాన్యంపై రైతులకు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ఉద్యాన సహాయకురాలు లక్ష్మి పాల్గొన్నారు.