మెట్పల్లి కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్
NEWS Oct 29,2026 01:54 pm
మెట్పల్లి: మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ వివిధ పార్టీలకు చెందిన 22 మంది కౌన్సిలర్లు సాధారణ కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లతో కూడిన అఖిలపక్షం సమావేశంలో నిరసన తెలిపింది. కౌన్సిలర్లతో చర్చించకుండానే వార్డుల్లో అభివృద్ధి పనులు, మున్సిపల్ ఎజెండా అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. చైర్మన్కు అనుకూలమైన వార్డులకే అభివృద్ధి నిధులు కేటాయిస్తూ, ఇతర వార్డులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.