ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ సరదాగా ఓ ఆఫర్ ఇచ్చారు. విమానంలో జరిగిన దాడిలో గాయపడిన స్మిత్‌ను పరామర్శిస్తూ, ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. 2 నెలలు పట్టవచ్చని స్మిత్ బదులిచ్చారు. దీంతో కోలుకున్నాక పోరాటం ఎలా చేయాలో ప్రత్యేక శిక్షణ ఇస్తానని అధ్యక్షుడు సరదాగా అన్నారు. దీనిని తనకు దక్కే గొప్ప గౌరవంగా భావిస్తున్నానని స్మిత్ తెలిపారు. విమాన సిబ్బంది, ప్రయాణికులు తన కుటుంబంతో సమానమని, వారికి UAE అండగా ఉంటుందని అధ్యక్షుడు భరోసా ఇచ్చారు. స్మిత్ సాహసానికి గుర్తింపుగా UAE ప్రభుత్వం ఆయనను ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారంతో సత్కరించింది.