పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెండ్
NEWS Oct 29,2026 11:57 am
HYD: దీపావళి నేపథ్యంలో స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో జి. పుల్లారెడ్డి స్వీట్స్ సనత్‌నగర్ యూనిట్‌పై చర్యలు తీసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణం, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన పదార్థాలు గుర్తించడంతో సంస్థ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. ఈ యూనిట్లో రూ.15.03 లక్షల విలువైన 3,133 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నగరవ్యాప్తంగా 16 స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, మొత్తం 3,546 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయగా, లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న మరో 5 దుకాణాలను మూసివేశారు.