ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
NEWS Oct 28,2026 10:11 am
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు. కోస్తా ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉంది. తెలంగాణలో ఖమ్మం, ములుగు, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.