విమానంలో అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్, ఫ్లైదుబాయ్ సిబ్బందికి UAE ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది. వారికి ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సెప్టెంబర్ 30న విమానంలో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ కాక్‌పిట్ డోర్ తెరిచి పెను ప్రమాదాన్ని నివారించినట్లు కథనం పేర్కొంది. ఆయన సాహసాన్ని ప్రధాని మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు.