రూ.15 మందును రూ.250కి అమ్ముతారా?
NEWS Oct 28,2026 09:52 am
దిల్లీ: ఔషధాల సరఫరా ధరకు, గరిష్ఠ చిల్లర ధరకు మధ్య భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రిటైల్ వ్యాపారికి రూ.15కే సరఫరా అయ్యే మందును రూ.250కి విక్రయించడాన్ని ఎలా సమర్థించుకుంటారని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం నిలదీసింది. అన్ని ఔషధాలపై ట్రేడ్ మార్జిన్‌ను 16 శాతానికి ఎందుకు పరిమితం చేయకూడదని ప్రశ్నించింది. ఔషధ ధరల నియంత్రణ సంస్థ పనితీరుపైనా ఆక్షేపణలు వ్యక్తం చేసింది. మందుల ధరలను నియంత్రించాలని, జనరిక్ మందులను సిఫార్సు చేయని వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తీర్పును వాయిదా వేసింది.