భారీగా తగ్గిన క్యాన్సర్ మందుల ధరలు
NEWS Oct 28,2026 11:29 pm
క్యాన్సర్ రోగులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 543 బ్రాండ్ల ఔషధాల ధరలను వరించినట్లు జాతీయ ఔషధ ధరల నిర్ణయ సంస్థ ప్రకటించింది. సవరించిన ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి వస్తాయి. ట్రేడ్ మార్జిన్ల నియంత్రణ ద్వారా కొన్ని మందుల ధరలు 80 శాతానికి పైగా తగ్గినట్లు సమాచారం. బెవాసిజుమాబ్ ఇంజెక్షన్ ధర రూ.21,767 నుంచి రూ.5,930కి, ఫుల్‌వెస్ట్రాంట్ ధర రూ.26,072 నుంచి రూ.5,491కి తగ్గినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో క్యాన్సర్ చికిత్స ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.