వినోద్‌కు టీఆర్‌ఎస్ జిల్లా బాధ్యతలు
NEWS Oct 27,2026 01:50 pm
కామారెడ్డి: తెలంగాణ రక్షణ సేన పార్టీ కామారెడ్డి జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడిగా రాజంపేట మండల కేంద్రానికి చెందిన జొన్నల వినోద్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సంపత్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గైని శ్రీనివాస్ గౌడ్ సహకారంతో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని వినోద్ కుమార్ పేర్కొన్నారు.