ఇంద్రవెల్లి సభను జయప్రదం చేయండి
NEWS Oct 27,2026 05:27 pm
ఈ నెల 30న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించనున్న TRS పార్టీ పాంచజన్య సంకల్ప సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్దన్ పిలుపునిచ్చారు. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే సిద్ధాంతాలతో కవితమ్మ ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ అంశాలకు ప్రాధాన్యమిస్తూ.. ప్రజల సంక్షేమం కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.